మనశ్శాంతిని కొనగలమా...?

Wednesday, 31 October 2012

బంగారాన్ని కొనచ్చు, బంగళాలు కొనచ్చు, అదృష్టం వరిస్తుంది అని బంగారు బల్లిని కొనవచ్చు.
కానీ మనశ్శాంతిని కొనగలమా.....అమ్మకానికి ఉంటె అందరు రెడీ అనుకుంటా.....
అమ్మకానికి
పెడితే బిల్ గేట్స్ అయిన దిగి రాకా ఏమి చేస్తాడు...

ఒక వూరిలో కోటీశ్వరుడు ఉండేవాడు.అతని కలవటానికి ఒక ఆసామి వస్తాడు, వచ్చిరాగానే మీకేంటండీ ...
కోటిశ్వర్లు అని పొగడటం మొదలుపెడతాడు. కోటీశ్వరుడు అతన్ని దగ్గరకు పిలిచి ఏమంటాడంటే ...
నాయినా మూడు పూటలు కడుపునిండా తిని, చేతినిండా పనిఉండి, మనశ్శాంతిగా పడుకొనే వాడే కోటీ
శ్వరుడు నాయినా అని బడులిస్తాడు.. అప్పటికే ఆసామి  నాలుక బయటపెట్టి ఇదెలా సాధ్యమండీ...కడుపు
నిండా తిన్నా, చేతినిండా పనిఉండదు, చేతి నిండా పనిఉన్నా సమయానికి తిండి ఉండదు, తిండి, పని
ఉన్న నిద్ర సరిగా ఉండదు మరీ మీ దృష్టిలో కోటీశ్వరుడు ఎవరండీ అని అడిగితే...అప్పుడు కోటీశ్వరుడు
బదులిస్తూ, కోట్లు వుండటం ముఖ్యం కాదు,మనశ్శాంతిగా బ్రతకటం అనేదే ముఖ్యం... అనవసర ఆశలు ,
కుళ్ళు , అత్యాశ, వ్యసనాలకు దూరంగా వుంటే మనశ్శాంతి అనేది అంత దగ్గరకు వస్తుంది అని చెప్పగానే
ఆసామి ఏమంటాడు అంటే ... వక్ర ప్రపంచములో మీరు చెప్పినట్టు కోట్లల్లో ఒకరైన ఉంటారా అని అడగ్గానే... కోటీశ్వరుడు బదులిస్తూ కోట్లలో కాదు నాయినా ప్రపంచములోనే ఒకరు కూడా ఉండరు, ఎందుకంటే మనశ్శాంతికి, మనకి పచ్చ గడ్డేస్తే భగ్గుమంటుంది. మనశ్శాంతి మనకు వద్దు అని కంకణం కటుకున్నమాయే... అది మన దగ్గరకు రావటానికి ఎందుకు ప్రయత్నిస్తుంది?

ఎలా మనశ్శాంతిగా ఉంటాం చెప్పండి...ఒక నెలలో ఫ్రిజ్ కొనాలి, ఇంకో నెలలో వాషింగ్ మెషిన్ కొనాలి కానీ
రెండు ఒకే నెలలో కొనంది నిద్రపట్టదు. మీ చిట్టి బాబు డ్రెస్ నీ ఎవరైనా పొగిడిన బాధే, పొగడకపోయిన బాధే ఎందుకుంటే వురికే పొగిడిన బయటకు తెలపరు కానీ, ఏమైతుందో ఏమో ఇంత పొగుడుతున్నారు దిష్టి తలుగుతుందేమో ఏమో అని మనసులో అనుకుంటారు..పొగడకపోతే ఎవరు పట్టించుకోవటం లేదని మనసులో బాధపక్కింటి వాళ్ళు కారు కొన్న , ప్లాట్ కొన్న మనకే బాధ. హీరోయిన్ కరీనాకు  పెళ్లి అయింది కానీ...నా బిడ్డకు ఇంకా పెళ్ళే కావట్లేదు...అని.. ఇలాంటి చిన్న విషయాలకే ఇంతా లోతుగా ఆలోచిస్తారు ...ఇంకెలా మనశ్శాంతిగా వుంటాం..

హాయిగా వుండటం నేర్చుకోండి..ఇది  బ్రహ్మ విద్యేమి కాదు అని అంటానని అనుకోకండి...ఇది బ్రహ్మ విద్యే ,
అంత సులభంగా మీ జేబులోకి రాదులెండి..ప్రయత్నించడం మన ధర్మం. అనవసర విషయాలను మెదడులో
నుండి తరిమేయండి. చిన్న చిన్న విషయాలను చట్టం కూడా పట్టించుకోదు అని ఎక్కడో విన్నాను.మనం కూడా అలా చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం మానేస్తే వంద శాతం కాకున్నా ఎంతో కొంత  మనశ్శాంతిగా వుండచ్చు.
అల్ ది బెస్ట్.....

No comments:

Post a Comment

 

Most Reading