Sex Thrilling...

Wednesday 14 November 2012

sex
source: Andhra Jyothi

మనశ్శాంతిని కొనగలమా...?

Wednesday 31 October 2012

బంగారాన్ని కొనచ్చు, బంగళాలు కొనచ్చు, అదృష్టం వరిస్తుంది అని బంగారు బల్లిని కొనవచ్చు.
కానీ మనశ్శాంతిని కొనగలమా.....అమ్మకానికి ఉంటె అందరు రెడీ అనుకుంటా.....
అమ్మకానికి
పెడితే బిల్ గేట్స్ అయిన దిగి రాకా ఏమి చేస్తాడు...

ఒక వూరిలో కోటీశ్వరుడు ఉండేవాడు.అతని కలవటానికి ఒక ఆసామి వస్తాడు, వచ్చిరాగానే మీకేంటండీ ...
కోటిశ్వర్లు అని పొగడటం మొదలుపెడతాడు. కోటీశ్వరుడు అతన్ని దగ్గరకు పిలిచి ఏమంటాడంటే ...
నాయినా మూడు పూటలు కడుపునిండా తిని, చేతినిండా పనిఉండి, మనశ్శాంతిగా పడుకొనే వాడే కోటీ
శ్వరుడు నాయినా అని బడులిస్తాడు.. అప్పటికే ఆసామి  నాలుక బయటపెట్టి ఇదెలా సాధ్యమండీ...కడుపు
నిండా తిన్నా, చేతినిండా పనిఉండదు, చేతి నిండా పనిఉన్నా సమయానికి తిండి ఉండదు, తిండి, పని
ఉన్న నిద్ర సరిగా ఉండదు మరీ మీ దృష్టిలో కోటీశ్వరుడు ఎవరండీ అని అడిగితే...అప్పుడు కోటీశ్వరుడు
బదులిస్తూ, కోట్లు వుండటం ముఖ్యం కాదు,మనశ్శాంతిగా బ్రతకటం అనేదే ముఖ్యం... అనవసర ఆశలు ,
కుళ్ళు , అత్యాశ, వ్యసనాలకు దూరంగా వుంటే మనశ్శాంతి అనేది అంత దగ్గరకు వస్తుంది అని చెప్పగానే
ఆసామి ఏమంటాడు అంటే ... వక్ర ప్రపంచములో మీరు చెప్పినట్టు కోట్లల్లో ఒకరైన ఉంటారా అని అడగ్గానే... కోటీశ్వరుడు బదులిస్తూ కోట్లలో కాదు నాయినా ప్రపంచములోనే ఒకరు కూడా ఉండరు, ఎందుకంటే మనశ్శాంతికి, మనకి పచ్చ గడ్డేస్తే భగ్గుమంటుంది. మనశ్శాంతి మనకు వద్దు అని కంకణం కటుకున్నమాయే... అది మన దగ్గరకు రావటానికి ఎందుకు ప్రయత్నిస్తుంది?

ఎలా మనశ్శాంతిగా ఉంటాం చెప్పండి...ఒక నెలలో ఫ్రిజ్ కొనాలి, ఇంకో నెలలో వాషింగ్ మెషిన్ కొనాలి కానీ
రెండు ఒకే నెలలో కొనంది నిద్రపట్టదు. మీ చిట్టి బాబు డ్రెస్ నీ ఎవరైనా పొగిడిన బాధే, పొగడకపోయిన బాధే ఎందుకుంటే వురికే పొగిడిన బయటకు తెలపరు కానీ, ఏమైతుందో ఏమో ఇంత పొగుడుతున్నారు దిష్టి తలుగుతుందేమో ఏమో అని మనసులో అనుకుంటారు..పొగడకపోతే ఎవరు పట్టించుకోవటం లేదని మనసులో బాధపక్కింటి వాళ్ళు కారు కొన్న , ప్లాట్ కొన్న మనకే బాధ. హీరోయిన్ కరీనాకు  పెళ్లి అయింది కానీ...నా బిడ్డకు ఇంకా పెళ్ళే కావట్లేదు...అని.. ఇలాంటి చిన్న విషయాలకే ఇంతా లోతుగా ఆలోచిస్తారు ...ఇంకెలా మనశ్శాంతిగా వుంటాం..

హాయిగా వుండటం నేర్చుకోండి..ఇది  బ్రహ్మ విద్యేమి కాదు అని అంటానని అనుకోకండి...ఇది బ్రహ్మ విద్యే ,
అంత సులభంగా మీ జేబులోకి రాదులెండి..ప్రయత్నించడం మన ధర్మం. అనవసర విషయాలను మెదడులో
నుండి తరిమేయండి. చిన్న చిన్న విషయాలను చట్టం కూడా పట్టించుకోదు అని ఎక్కడో విన్నాను.మనం కూడా అలా చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం మానేస్తే వంద శాతం కాకున్నా ఎంతో కొంత  మనశ్శాంతిగా వుండచ్చు.
అల్ ది బెస్ట్.....

మా ఇంటి పేరు ఆత్యాశ.....

ఆశ ఎవరికీ ఉండదు చెప్పండి..ఈ ప్రపంచములో ఆశ లేనివారు ఎవరైనా కనబడితే నాకు చెప్పండి ప్లీజ్ ...
ఎందుకు అ మాట అన్నానంటే ఆశ లేనిది బ్రతుకేలేదు కాబట్టి. ఆశ వుంటే తప్పులేదు కానీ ...అత్యాశ వల్లే కదా
మనం పడుతున్న ఈ  బాధలు .......

ఒక పదవ క్లాసు  అమ్మాయికి 600  మార్కులకు 590 వచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇంకా ఈ అమ్మాయి కి
సంతృప్తి లేదు.  ఈ అమ్మాయి మనసులో ఏదో చోట 600 కి 600 వస్తే ఎంత బాగుండేది ..నా రికార్డు ని ఎవరు చెరిపే వారు కాదని . దీన్ని ఆశ అంటారా? అత్యాశ అంటారా ?

ఈ మధ్యలో షేర్ మార్కెట్ గురించి వినని వారుండరు, ఈ షేర్ మార్కెట్లో కూడా ఆశ పడేవారే చాలా మంది ఉంటారు.
ఒకసారి లాభాలు రాగానే "షేర్ మార్కెట్ రాజా వారెన్ బఫెట్ అనుకుంటారు " కళ్ళు ఉన్నచోట వుండవు నెత్తిపైన ఎక్కి కూర్చుంటాయి. వీరి ఆలోచనలు ఎలా వుంటాయంటే ఒకే  రోజులో లక్షలు సంపాదించాలి, మేడలు కట్టేయ్యాలి
ఇలా వుంటాయి. ఈ రోజు లక్ష సంపాదించి రేపు లక్ష పోగొట్టుకోవని గ్యారంటి ఏంటి? ఉన్న డబ్బు తో షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే పర్వాలేదు కానీ ... డబ్బుకు ఆశపడి అప్పుతెచ్చి మరీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతారు. ఇలా
అప్పుతెచ్చి మరీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే ఏంటో తెలుసా... పెట్రోల్ బాంక్ లో నుండి పెట్రోల్ తెచ్చి  నీది  నీవే కాల్చేసుకోవటం ... పోస్ట్ ఆఫీసులో  8YEARS  గాని మీ డబ్బు డబుల్ అవదు. అక్కడ వెయిట్ చేసే ఓపిక వుంటుంది కానీ షేర్ మార్కెట్ లో రెండు  రోజులు కూడా ఆగలేరు. షేర్ పెరగటమే లేదు అని బిక్కమోకంవేసుకొని కూర్చుంటారు.ఆశ అనేది అత్యాశ  అవటం వల్లే ఈ షేర్ మార్కెట్ లో చాలా మంది నష్టపోతుంటారు.

వున్న దానితో హాయిగా బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూ ప్రపంచంలో... అలా హాయిగా వుంటే మనకు నిద్ర  ఎలా పడుతుంది.. మార్కెట్ కి వెళ్లి కూరగాయలు  కొని తెచ్చినట్టు, టెన్షన్స్ కూడా కొని తెస్తున్నాం. ఎందుకంటే మనం చాలా  లేటెస్ట్ .ఆశ వాళ్ళ ఎన్ని లాభాలు వుంటాయో అత్యాశ  వల్ల అన్ని నష్టాలూ వుంటాయి. సింగల్ బెడ్రూం కొనాలని ఆశ..కొన్న తర్వాత అయ్యో ఆ డబ్బులు దాచి కొన్నిరోజుల తర్వాత డబుల్ బెడ్రూం తీసుకుంటే  ఎంత బాగుండేది అని మళ్లీ ఏడ్పు. డబుల్ బెడ్రూం తీసుకోవాలన్న ఆశ మంచిదే ...నీవు కొన్న సింగల్ బెడ్రూంలో మరొకటి కొనే వరకు హాయిగా ఉండచ్చు కదా ... ఉండలేం మన బుద్దే అలాంటిది. అందమైన భార్య ని పెళ్లి చేసుకోవాలనుకోవటంలో తప్పు లేదు కానీ అనుకున్నట్టు అందమైన భార్య దొరికన కొందరు  వెయిట్ చేస్తే ఇంకా అందమైన భార్య దొరికి ఉండేది అని అదో భాధ  ...బాబు ఇంకా ఇంకా ...అనుకుంటే ముదిరిన వంకాయ అయిపోతావ్ ...అప్పుడు కొనటానికి ఎవ్వరు ఉండరు. నీవే కొనాల్సి వుంటుంది జాగ్రత్త నాయినా.

దయచేసి ఆశ పడండి కానీ అత్యాశ పడకండి..మనం ఆరోగ్యంగా వుండాలంటే హాయిగా వుండాల్సిందే తప్పదూ.  అత్యాశ వల్ల నష్టమే కానీ లాభమే లేదు. కాబట్టి అత్యాశ ను వదిలిపెట్టి కనబడని చోట బొంద పెట్టండి, దరిద్రం వదిలిపోతుంది.
NOW హ్యాపీ...
 

Most Reading